Ambati Rambabu: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. అంబటి రాంబాబు క్లారిటీ

by GSrikanth |   ( Updated:2022-07-08 06:17:14.0  )
Ambati Rambabu Gives Clarity On Early Elections
X

దిశ, వెబ్‌డెస్క్: Ambati Rambabu Gives Clarity On Early Elections| ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మహానాడు వేదికగా చంద్రబాబు, ఆవిర్భావ దినోత్సవం వేదికగా పవన్ కల్యాణ్, అనేక సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కార్యకర్తలను అప్రమత్తం చేశారు. తాజాగా.. ఈ విషయపై మినిస్టర్ అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. ప్లీనరీ సమావేశ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమస్యే లేదని స్పష్టం చేశారు. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, దానిని మధ్యలో దుర్వినియోగం చేయలేమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలపై ప్లీనరీలో దిశానిర్ధేశం చేస్తామని అన్నారు. అంతేగాక, ప్లీనరీ వేదికగా మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed