- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Allu Arjun: ‘పుష్ప-2’ నుంచి అదిరిపోయే అప్డేట్ .. రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన అల్లు అర్జున్
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ (Pushpa-2). అయితే ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), జగపతి బాబు(Jagapathi Babu) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) సంగీతం అందిస్తున్నారు. అయితే ‘పుష్ప-2’(Pushpa-2) సినిమా డిసెంబర్ 6న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ ఏమైందో ఏమో మళ్లీ ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలిపారు. అయితే ‘పుష్ప-2’ ఆరు భాషల్లో కలిపి 11, 500 స్క్రీన్స్‌లో డిసెంబర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో మాత్రం 5 వేల స్క్రీన్లు, భారత్‌లో 6500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.
అయితే ‘పుష్ప-2’(Pushpa-2) విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు. తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) దీపావళి సందర్భంగా ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రష్మిక భార్యగా.. వంట గదిలో సరసాలు ఆడుతున్న ఫొటోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజెంట్ బన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కెమిస్ట్రీ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.
Happy Diwali!! #Pushpa2TheRule pic.twitter.com/V5Xcp4RF7y
— Allu Arjun (@alluarjun) October 31, 2024