Allu Arjun : అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్

by M.Rajitha |   ( Updated:2024-12-13 11:41:38.0  )
Allu Arjun : అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్ : నటుడు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్ట్. సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premior Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్ళి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital)లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. ఇరువైపులా వాదనలు విన్న మేజిస్ట్రేట్ బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని తాజాగా బన్నీ హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ పై విచారణ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed