Pavan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్.. హుటాహుటిన హైద‌రాబాద్‌కు పవన్ కల్యాణ్ (వీడియో)

by M.Rajitha |   ( Updated:2024-12-13 13:01:07.0  )
Pavan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్.. హుటాహుటిన హైద‌రాబాద్‌కు పవన్ కల్యాణ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్ళి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital)లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. ఇరువైపులా వాదనలు విన్న మేజిస్ట్రేట్ బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని హైకోర్టు (High Court)లో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌(Quash Pitition) పై విచారణ జరుగుతోంది. కాగా బన్నీ అరెస్ట్ విష‌యం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్(AP Deputy CM Pavn Kalyan) కూడా హుటాహుటిన హైద‌రాబాద్‌(Hyderabad)కు వ‌స్తున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక విమానంలో ఆయ‌న హైద‌రాబాద్‌కి వ‌చ్చి నేరుగా అల్లు అర్జున్‌ని క‌ల‌వ‌బోతున్నట్లు స‌మాచారం.

Advertisement

Next Story

Most Viewed