Jharkhand Ropeway Accident: ముగిసిన జార్ఖండ్ రోప్ వే సహాయక చర్యలు.. హైకోర్ట్ కీలక ఆదేశం

by Satheesh |   ( Updated:12 April 2022 11:08 AM  )
Jharkhand Ropeway Accident: ముగిసిన జార్ఖండ్ రోప్ వే సహాయక చర్యలు.. హైకోర్ట్ కీలక ఆదేశం
X

రాంచీ: జార్ఖండ్ రోప్ వే ప్రమాదంలో సహయక చర్యలు ముగిశాయి. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సహాయక చర్యలు కొనసాగుతుండగా ఓ మహిళ అదుపుతప్పి పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో తీవ్రగాయాలకు తట్టుకోలేక మరణించినట్లు చెప్పారు. మరణించిన మహిళను దేవ్ గర్‌కు చెందిన డాక్టర్‌గా గుర్తించారు. మిగతావారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెప్పారు.

ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జార్ఖండ్ హైకోర్టు కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. అంతేకాకుండా దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నెల 26న విచారణ చేపట్టున్నుంది. అప్పటిలోగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉంది. కాగా, ఆదివారం త్రికూట్ పర్వతాల్లో రోప్ వేలో సాంకేతిక లోపం కారణంగా కేబుల్ కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో విద్యుత్ ఆగిపోవడంతో కేబుల్ కార్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, వాయుసేన, ఆర్మీ సహయక చర్యలు చేపట్టాయి.



Next Story