- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alia: ‘ఆ విషయంలో నా భర్త మద్దతుగా నిలిచారు’.. బాలీవుడ్ ప్రముఖ నటి ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అందాల భామ అలియా భట్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. క్యూట్‌నెస్, అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకుంది. ఇక అలియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తనకు అటెన్షన్ డిఫిసిట్ డిజాస్టర్ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ప్రతీదానికి అలియా టెన్షన్ పడుతానని వెల్లడించింది. అయితే తాజాగా దీని గురించి ఈ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ లో మాట్లాడింది.
ఈ పాడ్‌కాస్ట్‌లో అలియా అటెన్షన్ డిఫిసిట్ డిజాస్టర్ సమస్యను ఎదుర్కొంటున్నప్పటి విషయాలు పంచుకుంది. ఈ సమస్య వచ్చినప్పుడు కాస్త ఆందోళనగా ఉంటుందని.. కానీ వెంటనే ఊపిరి పీల్చుకుంటే నార్మల్ పొజిషన్ కు వస్తామని వెల్లడించింది. తెలియని గందరగోళం ఉంటుందని చెప్పింది. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసే సమయంలో భర్త రణ్‌బీర్ కపూర్ చాలా సపోర్ట్‌గా ఉన్నారని పేర్కొంది. అలాగే రాహా జన్మించినప్పుడు కూడా తన పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోకపోతే అందరూ ఏమని అనుకుంటారో అని కాస్త అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించింది.
కానీ తను చాలా చిన్నపాప అని.. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్ కాకూడదు కదా అంటూ వ్యాఖ్యానించింది. గతేడాది కారులో వెళ్తున్నప్పుడు రాహాతో ఫొటో దిగుదామని రణ్‌బీర్‌ను అడిగానని.. దీంతో ఆయన షాక్ అయి నువ్వేనా అడిగేదని అన్నారని చెప్పింది. ఆ సమయంలో కూడా అలియాకు కాస్త ఆందోళనగా అనిపించిందని తెలిపింది. దీంతో భర్త రణ్‌బీర్ వేరే టాపిక్ మాట్లాడుతూ అలియాను సాధారణ స్థితికి తీసుకొచ్చాడని కరీనా కపూర్ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్ లో అలియా చెప్పుకొచ్చింది.