- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alia Bhatt: గుడ్ న్యూస్ అనౌన్స్ చేసిన అలియా భట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) ఇటీవల ‘జిగ్రా’(jigra) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ వాసన్ బాలా (Vasan Bala) తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇదిలా ఉంటే.. అలియా భట్(Alia Bhatt) సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఆమె Ed-a-Mamma అనే స్టోర్‌ను ప్రారంభించింది. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ స్టోర్‌లో మదర్, బేబీస్‌కి సంబంధించిన వస్తువులు ఉంటాయని అన్నింటికి చూపించింది.
‘‘మేము మా మొట్టమొదటి ఎడ్-ఎ-మమ్మా(Ed-a-Mamma ) స్టోర్‌ని ప్రారంభించామని ప్రకటించడానికి నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. చిన్న ఆన్‌లైన్ కలగా ప్రారంభమైన ఈ మాయా, రంగుల ప్రదేశంగా ఎదిగింది. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు ఎడ్-ఎ-మమ్మా(Ed-a-Mamma ) ప్రపంచాన్ని అన్వేషించవచ్చు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి మాతో కలిసి ఈ కొత్త ఎడ్-వెంచర్‌లో మునిగిపోండి!. మీ చిన్నారులు ఇష్టపడే మా స్టోర్‌లోని బొమ్మలను(toys) తనిఖీ చేయడం మర్చిపోవద్దు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అలియా(Alia Bhatt)కు కంగ్రాట్స్ చెబుతున్నారు.