ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఐశ్వర్య కూతురు.. వారసత్వాన్ని..

by Harish |   ( Updated:2022-03-14 12:03:39.0  )
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఐశ్వర్య కూతురు.. వారసత్వాన్ని..
X

దిశ, సినిమా: ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్‌ల ముద్దుల కూతురు ముద్దుముద్దు మాటలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ మధ్య తన స్కూల్‌లో జరిగిన ఆన్‌లైన్ హిందీ వక్తృత్వ పోటీల నుంచి ఓ వీడియో రిలీజ్ కాగా భాష నేర్చుకోవడానికి అత్యుత్తమ మార్గం కవిత్వమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు జుట్లు వేసుకుని క్యూట్‌గా కనిపిస్తున్న ఆరాధ్య అంతే అందంగా, సుస్పష్టంగా హిందీ మాట్లాడింది. దీంతో ఫ్యాన్స్ తన పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రాయ్ అండ్ బచ్చన్ మిక్స్‌డ్ జీన్స్‌తో పుట్టిన పాప.. వారసత్వాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తుందని ప్రశంసిస్తున్నారు. దీనిపై స్పందించిన జూనియర్ బచ్చన్.. చేతులు జోడించి నమస్కరించాడు. పాపను ఎప్పటికీ ఇంతే ప్రేమగా యాక్సెప్ట్ చేయాలని అభిమానులను కోరాడు.

Advertisement

Next Story