- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చారలు లేని చారల గుర్రం.. అవాక్కవుతున్న నెటిజన్స్

X
దిశ, వెబ్‌డెస్క్: జీబ్రా అలియాస్ చారల గుర్రం. ఇవన్నీ కూడా తెలుపు నలుపు చారలతో ఒకేలా కనిపిస్తాయి. ఈ చారలు ఒకదానికి ఉన్నట్లు మరొక దానికి ఉండవని కూడా శాస్త్రవేత్తలు ఏనాడో చెప్పారు. అయితే తాజాగా ఓ జీబ్రా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది టాంజేనియాలోని సెరెంగెటి జతీయ పార్క్‌లో తారస పడింది. దీనికున్న ప్రత్యేక చారలు లేకపోవడం. అవును. ఈ జీబ్రా శరీరమంతా తెల్లగా ఉంది. వీపుపై మాత్రం అత్యంత తక్కువ సంఖ్యలో నల్లని చారలు కనిపిస్తున్నాయి. దీనిని ఎన్‌దాసియాటా అని పిలుస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా దీనిని చూసేందుకు అనేక ప్రదేశాల నుంచి పర్యాటకులు ఈ పార్క్‌కు వస్తున్నారు.
Next Story