NEETలో 321 స్టేట్ ర్యాంక్.. కానీ చదువు'కొనలేని' పరిస్థితి..

by Manoj |
NEETలో 321 స్టేట్ ర్యాంక్.. కానీ చదువుకొనలేని పరిస్థితి..
X

దిశ, బయ్యారం : ఓ నిరుపేద విద్యార్థిని 2021 సెప్టెంబర్ మాసంలో నీట్ లో ఎంట్రన్స్ టెస్టు రాసి 720 మార్కులకు గాను 446 మార్కులు సాధించింది. నీట్ ఆల్ ఇండియన్ క్యాటగిరిలో 1,37,328 ర్యాంకు పొందింది. ఆల్ ఇండియన్ జనరల్ కేటగిరిలో 3822 ర్యాంకు, రాష్ట్రంలో నీట్ ఎస్సీ క్యాటగిరిలో 321 ర్యాంకు సాధించింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని సంతులాల్ పోడు తండా పంచాయతీ పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన గోళి ధర్మయ్య సుమలతలకు ఇద్దరు కుమార్తెలు ప్రవళిక, పావణి.

ఉన్నత చదువుల కోసం వారి కుటుంబంపై పెను భారం పడిందని గోళి ధర్మయ్య కుటుంబం ఆవేదనతో శనివారం 'దిశ'తో వారి బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద కుమార్తె ప్రవళిక బీటెక్ చదువుతుంది. చిన్న కుమార్తె పావణి ఇంటర్ బైపీసీ హైదరాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హస్టల్ లో చదివింది. పావణి తండ్రి రోజు తాపీ పనులు చేస్తూ ఇద్దరి కుమార్తెలను పైచదువులు చదివించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పావణికి ఎంబీబీఎస్ ఎలాగైనా చదవాలని పట్టుదల ఉన్న.. తమ కుటుంబ ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలిచాయి.

రాష్ట్రంలో నీట్ లో 321 ర్యాంకు సాధించి.. ఎంబీబీఎస్ లో ప్రవేశానికి ప్రయివేటు ప్రతిమ ఎంబీబీఎస్ కాలేజి నుండి కౌన్సిలింగ్ కు అనుమతి పొందింది. ఈ నెల 16 న ప్రతిమ కాలేజ్ కౌన్సిలింగ్ అటెండు కావాల్సి ఉన్నా.. వారి వద్ద డబ్బులు లేవని తెలుపుతున్నారు. ఎంబీబీఎస్ ఐదు సంవత్సరాల కోర్సుకు ప్రతి సంవత్సరం రూ.3లక్షల చొప్పున 15 నుండి 20 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ వెళ్లే సందర్భంలో కాలేజీ ఫీజు రెండు లక్షలు ఖర్చు అవుతుంది. దీంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. దయతలిచి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఆదుకోవాలని పావణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సహాయం కోసం SBI a/c no.40788634454 , ఐఎఫ్ సి కోడ్ sbinoo20554, phone pay, google pay, peytm no.6305527850 సహాయం అందించిన వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం.

Advertisement

Next Story

Most Viewed