- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి గుడ్ హార్ట్ అనిపించుకున్న రియల్ హీరో.. చిన్నారికి ఉచితంగా గుండె ఆపరేషన్

దిశ, సినిమా: సినీ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు. కానీ, బయట మాత్రం రియల్ హీరో అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. కష్టాల్లో ఉన్నారంటే చాలు.. నేనున్నానంటూ చేయూత అందిస్తాడు. ఇంకా కరోనా వంటి కష్ట సమయంలో సోనూసూద్ అందించిన అండా దండా అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఎవరికీ ఏ అవసరం ఉన్నా కాదనకుండా హెల్ప్ చేస్తాడు. అలాగే కొన్ని ఫౌండేషన్లను కూడా రన్ చేస్తూ ప్రజలను ఆదుకుంటున్నాడు. ఈ క్రమంలో సోనూసూద్ మరోమారు తన గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు. చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన నిరుపేద కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురు చిన్నప్పటినుంచే గుండె సమస్యతో బాధపడుతుంది. ఆపరేషన్‌కు రూ.6 లక్షలకుపైగా ఖర్చువుతుందని స్థానిక వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేయించారు. కాగా చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.