- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శుభకార్యానికి వచ్చి విషాదం.. సాగర్ ఎడమకాల్వలో వ్యక్తి గల్లంతు
దిశ, నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం లో ఓ వ్యక్తి కాలువలో గల్లంతైన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. నకిరేకల్ పట్టణానికి చెందిన మేడారం నాగరాజు కోట మైసమ్మ గుడి దగ్గర ఫంక్షన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన ఆకుల చంద్రమౌళి, తన స్నేహితులతో కలిసి హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ముకుందాపురం సాగర్ ఎడమకాల్వలో సరదాగా ఈత కొడదామని ఆగారు.
ముందుగా సమ్మెట శివ నీటిలో దిగి ఈత కొడుతున్నారు. అనంతరం ఆకుల చంద్రమౌళి నీటిలో దునికి ఈత కొట్టే ప్రయత్నం చేయగా.. ఇప్పటికే మద్యం సేవించి ఉన్న చంద్రమౌళి ఊపిరాడకపోవడం తో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నిడమానూరు పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించారు. తక్షణమే ఎస్ఐ శోభన్ బాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ వ్యక్తి గల్లంతైన ప్రదేశం త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో త్రిపురారం పోలీసులకు సమాచారం అందించగా.. త్రిపురారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.