చెరువులో స్నానానికి దిగి.. తిరిగి రాని లోకాలకు..

by Javid Pasha |
చెరువులో స్నానానికి దిగి.. తిరిగి రాని లోకాలకు..
X

దిశ, రామాయంపేట : చెరువులో స్నానానికి అని దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం జెడ్ చెరువు తండాలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెడ్ చెరువు తండా గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మణ్ నాయక్ (36) శనివారం చెరువులో స్నానానికి అని దిగాడు. ప్రమాదవశాత్తు చేపల వల కాళ్ల మధ్యలో చిక్కుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆదివారం లక్ష్మణ్ జాడ కోసం వెతకగా గ్రామంలోని చెరువు వద్ద అతని దుస్తులు కనిపించడంతో చెరువులో పడినట్లు గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.

Advertisement

Next Story