రెండు తలలు, మూడు చేతులతో జన్మించిన శిశువు

by Mahesh |   ( Updated:2022-03-31 05:23:59.0  )
రెండు తలలు, మూడు చేతులతో జన్మించిన శిశువు
X

దిశ, వెబ్ డెస్క్: రెండు తలలు, మూడు చేతులతో జన్మించిన శిశువు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లాలో బుధవారం ఓ మహిళ రెండు తలలు, మూడు చేతులు ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ బాలుడి జననంపై ఇండోర్‌లోని MY హాస్సిటర్ డాక్టర్ బ్రజేష్ లాహోటి మాట్లాడుతూ.. పిల్లవాడు ప్రస్తుతం సపోర్ట్ సిస్టం లో స్థిరంగా ఉన్నడు.

ఇది డై‌సెఫాలిక్ పారాపాగాస్ అనేది ఒక మొండెం మీద రెండు తలలు పక్కపక్కనే ఉండే పాక్షిక కవలల అరుదైన రూపం. వీరిని చాలా సార్లు ''రెండు తలల పిల్లలు'' అని పిలుస్తారు. ఈ పరిస్థితిని పారాపాగస్ డైసెఫాలస్ అని కూడా అంటారు. అయితే ఎక్కువ శాతం ఇలాంటి కేసుల్లో పుట్టిన వెంటనే పిల్లలు చనిపోతారు.. తక్కువ సంఖ్యలో మాత్రమే యుక్తవయసు వరకు జీవించే చాన్స్ ఉందని డాక్టర్ బ్రజేష్ లాహోటి అన్నారు.

Advertisement

Next Story