- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Lakshya Sen: లక్ష్య సేన్.. అదరహో.. భారత్‌కు మరో స్వర్ణం..
దిశ, వెబ్‌డెస్క్: Lakshya Sen Wins Gold medal in men's Singles Badminton at CWG 2022| కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత యంగ్ షట్లర్ లక్ష్య సేన్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతడు మలేషియాకు చెందిన ప్రత్యర్థి యాంగ్‌ను 19-21, 21-9, 21-16 తేడాతో చిత్తు చేసి.. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు 20వ స్వర్ణ పతకాన్ని అందించాడు. కాగా, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్వర్ణ పతకం సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ గోల్డ్ కైవసం చేసుకున్నాడు. అయితే, కామన్వెల్త్ చరిత్రలోనే భారత్ బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ రెండింటిలోనూ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ గేమ్‌లో లక్ష్య సేన్ పోరాట పటిమకు అందరు ఫిదా అయ్యారు. తొలి సెట్ కోల్పోవడమే కాకుండా.. రెండవ సెట్‌లో వెనకబడినప్పటికీ.. అధైర్య పడకుండా పోరాడి అద్భుత విజయం సాధించాడు. ఈ మెడల్‌తో ఇండియా మొత్తం సాధించిన మెడల్స్ సంఖ్య 57కు చేరింది.
ఇది కూడా చదవండి: కామన్వెల్త్ 2022 లో పీవీ సింధుకు తొలిసారి బంగారు పతకం