10th Class Diaries.. అందరినీ మెప్పింస్తుందంటున్న అవికా

by Manoj |   ( Updated:2022-06-27 13:24:37.0  )
10th Class Diaries to be Released On July 1
X

దిశ, సినిమా: 10th Class Diaries to be Released On July 1| శ్రీరామ్, అవికా గోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. 'గరుడ వేగ' ఫేమ్ అంజి దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమాను అజయ్ మైసూర్ సమర్పణలో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్స్‌పై అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా అవికా గోర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర విషయాలు పంచుకుంది.

'ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. లిటిల్ బిట్ డ్రామా, ఫ్లాష్‌బ్యాక్‌, కామెడీ అభిమానులను ఆకట్టుకుని, అందరినీ మెప్పింస్తుందని ఆశిస్తున్నా. హీరో శ్రీరామ్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. దర్శకనిర్మాతలు కూడా సపోర్టుగా నిలబడి ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోగా సినిమా కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతుందనే నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చింది. చివరగా ఈ చిత్రంతో తనలో మరింత కాన్ఫిడెంట్‌ పెరిగిందన్న అవిక.. కేపబిలిటీ మించి పని చేయగలని తెలుసుకున్నట్లు వెల్లడించింది.


Also Read: సెట్‌లో గొడవ జరిగింది నిజమే.. ఆవేశంలో బూతులు తిట్టానంటూ..

Advertisement
Next Story

Most Viewed