- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెటర్నిటీ లీవ్‌లో ట్విట్టర్ సీఈవో.. 'ఈక్వల్ పేరెంటింగ్'కు నిదర్శనమా!
దిశ, ఫీచర్స్: ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్ మరికొన్ని రోజుల్లో తండ్రి కాబోతున్నాడు. దీంతో 'కొన్ని వారాల' పాటు పితృత్వ సెలవు తీసుకోగా.. ఈ గెశ్చర్‌తో ఆయన 'ఈక్వల్ పేరెంటింగ్'కు ఉదాహరణగా నిలిచారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'పెటర్నిటీ లీవ్' ప్రాధాన్యత తెరపైకి రాగా.. ఎందుకు అమలు చేస్తున్నారో తెలుసుకోండి.
పసిపిల్లల పట్ల తల్లికన్నా మించిన ప్రేమ, కేరింగ్‌ను ఇంకెవరూ చూపించలేరు. బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు కూడా ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలను ఆమె విస్మరించదు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లులకు శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. ఈ దశలో భాగస్వామి ఆమె పక్కన ఉండి చిన్న చిన్న విషయాల్లో సాయపడాల్సిన అవసరం ఉంది.
కానీ తరతరాలుగా చాలా కుటుంబాల్లో తండ్రి పాత్ర ఆర్థికపర విషయాలకే పరిమితం అవుతోంది. అయితే పిల్లల సంరక్షణలో వారిని కూడా భాగం చేయాలనే ఉద్దేశంతోనే 'పెటర్నిటీ లీవ్' తెరమీదకు వచ్చింది. పిల్లల పెంపకం అంటే లింగ నిర్దిష్ట ఉద్యోగం కాదని, ఆలుమగలు ఇద్దరూ ఇందులో సమానమని చాటిచెప్పడంతో పాటు పేరెంట్‌హుడ్ ప్రారంభ రోజుల్లో తన భాగస్వామి నుంచి మద్దతు పొందేలా చేయడమే దీని ఉద్దేశం.
పితృత్వ సెలవు.. బిడ్డకు కొత్త వాతావరణాన్ని అలవాటు చేయడమే కాక తల్లి త్వరగా కోలుకునే వీలు కల్పిస్తుంది. అంతేకాదు పిల్లల పెంపకంలో భాగస్వామి నుంచి మద్దతు లేకపోవడంతో చాలా మంది తల్లులు తమ ఉద్యోగాన్ని వదిలి వేస్తున్నారు. దీన్ని నివారించేందుకు అనేక భారతీయ కంపెనీలు పురుషులకు పితృత్వ సెలవులు మంజూరు చేస్తూ పేరెంటింగ్ విషయంలో సమానత్వానికి సాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ తన భార్య రెండో కాన్పు కోసం పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు.