- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టెలిగ్రామ్‌లో న్యూ ఫీచర్
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో కొత్త సర్వీసు రాబోతోంది. ఎప్పటి నుంచో టెలిగ్రామ్ యూజర్లు ఎదురుచూస్తున్న ‘వీడియో కాలింగ్’ ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చిన టెలిగ్రామ్. మరికొన్ని రోజుల్లో ఒరిజనల్ వెర్షన్ తీసుకు రానుంది. టెలిగ్రామ్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ వస్తే కచ్చితంగా వాట్సాప్‌కు గట్టిపోటీనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని టెక్ విశ్లేషకులు అంటున్నారు. వాట్సాప్‌తో పోలిస్తే.. టెలిగ్రామ్‌లోని ఫీచర్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఇప్పటికే నార్త్ ప్రజలు టెలిగ్రామ్ యాప్‌పై మక్కువ పెంచుకోగా.. సౌత్ ఇండియన్స్ ఇప్పుడిప్పుడే ఈ యాప్‌కు అలవాటు పడుతున్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఆడియో ఆప్షన్ ప్రవేశపెట్టిన నాలుగేండ్ల తర్వాత వీడియో కాలింగ్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. అయితే, టెలిగ్రామ్ ద్వారా వీడియో కాలింగ్ చేసుకోవాలనుకుంటే మాట్లాడే ఇద్దరికి బీటా వర్షన్ అందుబాటులో ఉండాలి. దీనితో కంపెనీ ప్రతినిధులు కూడా వీడియో కాలింగ్ అందుబాటులోకి రావడంతో యూజర్స్ మరింత పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే 20 దేశాల్లోనూ అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన సోషల్ మీడియా యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 బిలియన్ల యూజర్లకు చేరిన వాట్సాప్‌తో పోలిస్తే టెలిగ్రామ్ యూజర్ బేస్ ఇంకా పెరుగుతూనే ఉంది.