- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై టెలికాం రంగం వ్యూహం!
దిశ, వెబ్‌డెస్క్: కరోనాను ఎదుర్కోవడం అంతర్జాతీయంగా చాలా సంస్థలు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో టెలికాం సంస్థలు సైతం తమ వంతుగా ప్రజలకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటున్నాయి.
రిలయన్స్ జియో:
ఇందులో భాగంగా రిలయన్స్ జియో తక్కువ చార్జింగ్‌లతో ఎక్కువ డేటాను తమ వినియోగదారులకు ఇవనున్నట్టు ప్రకటించింది. ఇందులోనే అదనపు టాక్‌టైం కూడా ఉంటుందని ప్రకటించింది. రూ. 11 నుంచి రూ. 101 విలువైన ఓచర్ల 4జీ డేటాతో డబుల్ డేటాను వాడుకోవచ్చని వివరించింది. డేటా పరిమితి పూర్తయిన తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్ అపరిమితంగా వాడుకోవచ్చని తెలిపింది. వీటిలో…రూ. 11 రీఛార్జ్‌తో 800 ఎంబీ హైస్పీడ్ డేటాతో పాటు 75 నిమిషాల్ టాక్‌టైం, రూ. 21తో 2జీబీ డేటా, 200 నిమిషాల టాక్‌టైం, రూ. 51తో 6జీబీ డేటా, 500 నిమిషాల టాక్‌టైం, రూ. 101కి 12 జీబీ డేటా, వెయ్యి నిమిషాల టాక్‌టైం అందుతుందని స్పష్టం చేసింది.
బీఎస్ఎన్ఎల్:
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ కూడా వినియోగదారుల కోసం ప్రత్యేక నిర్ణయాలను ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే క్రమంలో ఇప్పటికే చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వోద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను వెల్లడించింది. ప్రమోషనల్ ఆఫర్‌గా తెచ్చిన ఈ ప్లాన్ ద్వారా ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఉచితంగా నెల రోజుల వరకూ సేవలు అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ నుంచి 10 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో పాటు ఒకరోజుకు 5 జీబీ డేటాను వాడుకోవచ్చు. డేటా పరిమితి దాటితే వేగ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుందని వివరించింది.
tags : COVID-19,Corona Virus, bsnl, Broad Band plan, reliance Jio, Talktime, Data