- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీక్ష విరమించిన కిషన్ రెడ్డి.. సర్కార్‌కు ప్రకాశ్ జవదేకర్ హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ బీజేపీ స్టేట్ కార్యాలయంలో ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువను కూడా అభినందిస్తున్నాన్నారు.
ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్‌కు చూపించామన్నారు. నిన్న కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తే.. కేసీఆర్ సర్కారుకు ప్రాబ్లం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ భయపడ్డాడని, అందుకే పోలీసులను పంపించి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేశాడన్నారు. తెలంగాణ యువతను మోసం చేశామనే విషయం వారికి కూడా తెలుసన్నారు. అందుకే భయపడుతున్నారని, యువత కేసీఆర్‌ను తొలగించాలని, తెలంగాణను బతికించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్‌పై ఇంకా చేయాల్సింది చాలా ఉందని, వంద రోజుల సమయం తమ దగ్గర ఉందన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే ఉద్యమాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.