- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతికి సాధించుకుందాం.. నిరుద్యోగులను చేతులెత్తి వేడుకున్న ఎంపీ కోమటిరెడ్డి (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు శనివారం ఓ మీడియో విడుదల చేశారు. ‘నిరుద్యోగులారా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి. బతికి సాధించుకుందాం. రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు అందరికీ న్యాయం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. చేతులెత్తి మొక్కుతున్న దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకండి. కన్న తల్లి తండ్రులకు కడుపుశోకం మిగిల్చకండి. ప్రవళిక ఆత్మహత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి..
రూ.కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించాలి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చనిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పదేళ్లలో ఒక్క గ్రూప్ పరీక్ష నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు. నీళ్లు నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల కోసం చచ్చిపోతున్నారు. ఉద్యోగాల కోసం యువకులు పిచ్చోళ్ళలాగా తిరుగుతూ కుటుంబాలకు దూరం అవుతున్నారు. నిరుద్యోగుల ఉసురు ముట్టి ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకపోతుంది. నిరుద్యోగులారా రెండు నెలలు ఓపిక పట్టండి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా ఇస్తాం.’’ అని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వేడుకున్నారు.