డీకే శివకుమార్‌తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ?

by GSrikanth |   ( Updated:2023-06-23 05:58:44.0  )
డీకే శివకుమార్‌తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే కోమటిరెడ్డి బెంగళూరు వెళ్లారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పార్టీలో చేరికలపై డీకేతో వెంకట్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ కూడా దూకుడు పెంచింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ రాబట్టడం ఈజీ అని భావిస్తున్న హైకమాండ్‌.. ఇక్కడ కూడా డీకే శివకుమార్‌ సేవలు ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా ఉన్నా.. రిమోట్ కంట్రోల్ ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలో చేరికలు మొదలు కీలక నిర్ణయాల్లో డీకే ఆమోదంతోనే అమలు కానున్నాయని సమాచారం. కర్ణాటకలో పార్టీని గెలిపించిన డీకే శివకుమార్ పైన పార్టీ హైకమాండ్‌కు మంచి నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల బాధ్యతలను డీకేకి అప్పగించాలని నిర్ణయించారు. డీకే ఇక తెలంగాణలో మకాం వేయనున్నారని, ఆయన నిర్ణయాలే కీలకం కానున్నాయని, అందుకే నేతలు ఆయనతో వరుస భేటీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read..

CM KCR: మంత్రి హరీష్‌తో కలిసి ఇంటికి రా.. సర్పంచ్ నీలం మధుకు సీఎం ఆహ్వానం!

Advertisement

Next Story