- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ను మ్యాచ్ చేసే లీడర్ బీజేపీలో ఉన్నారా?
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకం అని వ్యాఖ్యానించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులు పదేళ్లలో అంతకుమించి కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. రూ.2 వేల పెన్షన్‌తో వృద్ధుల ఆత్మగౌరవం పెరిగిందని తెలిపారు. ఎన్నికల అనంతరం క్రమంగా పెన్షన్‌ను రూ.5 వరకు పెంచుతామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టోను ప్రజల వద్దకు చేర్చాలని కార్యకర్తలకు సూచించారు. రైతులపై పగబట్టినట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా రైతులకు ఎంతో ఉపయోగకరమైన రైతుబంధును ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. హాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను మ్యాచ్ చేసే లీడర్ బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో అభ్యర్థులు లేక బీజేపీ వెలవెలబోతోందని ఎద్దేవా చేశారు.