TS: జాతీయ పార్టీ కీలక నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్

by GSrikanth |   ( Updated:2023-10-30 15:05:52.0  )
TS: జాతీయ పార్టీ కీలక నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన సమాజ్ పార్టీ సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. 43 మందితో కూడిన అభ్యర్థుల రెండో జాబితాను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. సోమవారం లక్డీకపూల్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండో జాబితాకు సంబంధించిన వివరాలను ఆర్ఎస్పీ వెల్లడించారు. మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించగా రెండో జాబితాలో 43 మందిని అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటి వరకు బీఎస్పీ 63 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 56 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. కాగా, ఇవాళ ప్రకటించిన సెకండ్ లిస్ట్‌లో వరంగల్ ఈస్ట్ నుంచి పుష్పిత లయ అనే ట్రాన్స్ జెండర్ పేరును ఖరారు చేశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా లయ నిలవనున్నారు.




Advertisement

Next Story