ఏ క్షణాన్నైనా కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల అవ్వొచ్చు: ఎంపీ కోమటిరెడ్డి

by GSrikanth |   ( Updated:2023-11-23 13:24:45.0  )
ఏ క్షణాన్నైనా కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల అవ్వొచ్చు: ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ అభ్యర్థుల తుది లిస్ట్‌‌ను ఫైనల్ చేయడానికి ఢిల్లీ వేదికగా సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో కీలక నేతలు పాల్గొన్నారు. అభ్యర్థుల కసరత్తును స్క్రీనింగ్ కమిటీ దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చర్చ సానుకూలంగా జరిగిందని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. అన్ని సీట్లపై కసరత్తు పూర్తైంది. కొన్ని ప్యానెల్‌కి పంపించాము. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిర్ణయం తీసుకుంటారు. సీఈసీ ఆమోదం తర్వాత లిస్టు ఏ క్షణాన్నైనా విడుదలయ్య అవకాశం ఉంది అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story