బీజేపీకి రేవంత్ రెడ్డి కోవర్టు.. ఇది జగమెరిగిన సత్యం

by GSrikanth |   ( Updated:2023-09-02 14:58:38.0  )
బీజేపీకి రేవంత్ రెడ్డి కోవర్టు.. ఇది జగమెరిగిన సత్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా, మోడీలను ప్రసన్నం చేసుకునేందుకు హెడ్గేవార్ గురించి ఎంతో ఉత్సాహంతో ప్రస్తావించడాన్ని బట్టి రేవంత్ బీజేపీకి కోవర్టు మిత్రుడనే సంగతి బయటపడిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ఇది జగమెరిగిన సత్యమని అన్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు వ్యవహరించే రేవంత్ రెడ్డి, బట్టకాల్చి మంది మీద వేసినంత మాత్రాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేస్తూ బీజేపీతో తమరికున్న పేగుబంధం మరియు గుండుగుత్త రాజకీయ ఒప్పందం గూర్చి తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. ఇకనైనా బొంకులాడు రాజకీయాలు ఎందుకు రేవంత్ రెడ్డి? అని ఆయన ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

Advertisement

Next Story