- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రగతి భవన్ పేరు మార్పు.. రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. పోలింగ్ దగ్గర పడుతుండటంతో ప్రచార బరిలోకి అగ్రనేతలు దిగారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను ప్రజా పాలన భవన్‌గా మార్చేస్తామన్నారు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్ గేట్లు 24 గంటలు ఓపెన్‌గానే ఉంటాయన్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యల్ని సీఎం సహా మంత్రులంతా వింటారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల్ని 72 గంటల్లో పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రజా పాలన భవన్ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Read More..
ఇంకెన్ని అవకాశాలు ఇవ్వాలి కేటీఆర్ బాబూ.. కొంచెమైనా ఉండొద్దా?