బర్రెలక్కకు బిగ్‌బాస్‌-7లో ఆఫర్‌, గిఫ్ట్‌గా ఖరీదైన కారు కూడా.. క్లారిటీ ఇచ్చిన శిరీష

by Hamsa |   ( Updated:2023-11-24 06:11:00.0  )
బర్రెలక్కకు బిగ్‌బాస్‌-7లో ఆఫర్‌, గిఫ్ట్‌గా ఖరీదైన కారు కూడా.. క్లారిటీ ఇచ్చిన శిరీష
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో ఓ నిరుద్యోగి అయిన శిరీష అనే యువతి ఓ వీడియోతో ప్రభుత్వానికే సవాల్ విసిరిన విషయం తెలిసిందే. హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకు చెప్తే నాలుగు గేదేలను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్.. అంటూ బర్రెలక్క ఏడాదిన్నర కిందట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ వీడియో అప్పట్లో ఫుల్ వైరల్‌గా మారడంతో బర్రెలక్కగా ఆమె ఫేమస్ అయింది. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కావడంతో బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బక్కెలక్క దిగి మరోసారి వార్తల్లో నిలిచింది. నాగకర్నూల్ కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తుంది.

ఆమెకు పలువురు ప్రముఖులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఆమె ప్రచారంలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-7లో ఆఫర్ వచ్చిందని, ఆమెకు ఓ కారు కూడా గిఫ్ట్‌గా పంపించారని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రెలక్క క్లారిటీ ఇచ్చింది. ‘‘ బిగ్‌బాస్ వాళ్లు నన్ను ఇంతవరకు సంప్రదించలేదు. బహుశా నా గురించి వాళ్లకు తెలియదేమో. వారి దగ్గర నుంచి నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు. అలాగే నాకు కారు కొనిచ్చారన్నది పూర్తిగా అబద్ధం. అన్నవాళ్లు నేను ఇబ్బంది పడుతున్నా అని వాళ్లు నడుపుతున్న కార్లు తీసుకొచ్చి ప్రచారానికి వాడుకోమన్నారు. ఒక కారు మాత్రం ఒక అన్న మాత్రం ఉచితంగా ఇచ్చాడు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story