- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలేరులో కాంగ్రెస్‌కు షాక్.. కల్లూరి రామచంద్రారెడ్డి రాజీనామా
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన తన రాజీనామా లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూప్ రాజకీయాల కారణంగా పార్టీలో ఉండలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే ముఖ్యమంత్రి అనుకోవడం వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంధకారంలో ఉంటుందని, పార్టీ కోసం కష్టపడిన వారు కాకుండా పార్టీలో అవకతవకలు, టికెట్లు అమ్మకాల దృష్ట్యా మనస్థాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అప్లికేషన్ పెట్టుకున్న వారికి కనీస మర్యాద ఇవ్వకుండా సంప్రదించకుండా పీసీసీ నుంచి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని భావిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నాలుగున్నర సంవత్సరాలుగా తనకు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరే అవకాశం?
అయితే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కల్లూరి రామచంద్రారెడ్డి ఆలేరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.