- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి మరో BIG షాక్.. రాత్రి వివేక్‌తో రేవంత్ రెడ్డి భేటీ!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈసారి ఎలాగైన అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దాదాపు 100 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచింది. అంతేగాకుండా పార్టీలోకి కీలక నేతలను చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో వివేక్ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్ రెడ్డి వచ్చారు. గన్ మెన్ కూడా లేకుండా ఒంటరిగా వచ్చిన రేవంత్.. దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్ ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
అదే సమయంలో వివేక్ పేరు వినిపించినా కూడా ఆయన మాత్రం ఆ పుకార్లను ఖండించారు. తానింకా బీజేపీలోనే ఉన్నానని, ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా రేవంత్ స్వయంగా కలిసి ఆహ్వానించడంతో ఆయన సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ కూడా కచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ లాంఛనం కూడా పూర్తయితే బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడినట్టే. విజయశాంతి వంటి అసంతృప్తులు కూడా బీజేపీపై లోలోపల రగిలిపోతున్నారు. ఎన్నికలనాటికి బీజేపీకి కీలక నేతలు దూరమయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. వివేక్ సోదరుడు వినోద్‌కి ఆల్రడీ కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. మరి వివేక్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.