- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో హంగ్.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ వస్తే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలసి పనిచేయాలని ముందస్తుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చి హంగ్ ఏర్పాటుకు బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగిన క్రైస్తవ హక్కుల సమావేశంలో ఆయన మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను పవర్‌లోకి రానివ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్‌లు కుట్రలకు పాల్పడుతున్నాయన్నారు. ప్రజలంతా ఆ రెండు పార్టీలు చేసే దొంగ రాజకీయాలను గమనంలోకి తీసుకోవాలన్నారు. ఇక, సోనియా గాంధీని విమర్శించే నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. డిసెంబర్ నెలను మిరాకిల్ మంత్ అంటారని, 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చినట్లే.. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందన్నారు. కానీ, సెంటిమెంట్ ప్రభావంతో స్థానిక పార్టీ పవర్‌లోకి వచ్చిందన్నారు. వచ్చిన రాష్ట్రంలో ఆకాంక్షలు ఏమీ నెరవేరలేదన్నారు. క్రిస్టియన్ సామజిక వర్గం సమాజంలో కీలకమైనదని, ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం రావడం లేదన్నారు. 42 శాతం పట్టభద్రులు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు చిదంబరం ప్రత్యేక పాత్ర పోషించారన్నారు. మందిరాలు, మసీదులు నిర్మిస్తున్నట్టు చర్చులకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రతి నిరుపేదకు అందజేస్తామన్నారు.