- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: ఆ హక్కును ఉల్లంఘించి.. ఓటర్లను టార్చర్ చేస్తున్న అభ్యర్థుల ప్రచారం!
దిశ, తెలంగాణ బ్యూరో: మీకు రైతుబంధు వస్తున్నదా?.. ఆసరా పింఛన్సమయానికే అందుతున్నదా? అయితే కృతజ్ఞతగా మీ ఓటు బీఆర్ఎస్ కే వేయాలి.. అంటూ టెలీకాలర్లు ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఈ కాల్ వచ్చే ఉంటుంది. ఎన్నికల మాటేమో కానీ, ఈ రకం ఫోన్ కాల్స్‌తో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సమయం, సందర్భం అనేది ఏమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి.. సర్వేలంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. మీ ఓటు ఎవరికి వేస్తారు? ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీఆర్ఎస్ పథకాలు అందుతున్నాయా? పాలన ఎలా ఉన్నది అంటూ చెవుల్లోని తుప్పు వదలగొడుతున్నారు. కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చిందంటేనే ఏ అభ్యర్థి పక్షాన ప్రచారమోనని జనం హడలిపోతున్నారు.
టెలీకాలర్ ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థులు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేసమయంలో సమయం వృథా చేయకుండా ఓటర్లకు టెలీకాలర్స్‌తో ఫోన్లు చేయిస్తున్నారు. ఈ విషయంలో అధికారపార్టీయే ముందంజలో ఉన్నది. మీకు రైతు బంధు అందుతున్నదా? మీ ఇంటికి ఆసరా పింఛన్ వస్తున్నదా? అయితే బీఆర్ఎస్కే ఓటు వేయాలంటూ కోరుతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పనితీరు ఎలా ఉన్నది? మీది ఏ నియోజకవర్గం? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇలా సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారు. సమయం, సందర్భం ఏదీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టెలీకాలర్స్ ఫోన్ చేసి ప్రశ్నలు వేస్తుండటంతో జనం విసుగెత్తిపోతున్నారు.
ఓటు గోప్యతకు విలువేది?
ఓటు ఎవరికి వేశామన్నది గోప్యంగా ఉంచడం ఓటరు హక్కు. కానీ, మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఫలానా వ్యక్తికే వేయాలని అని కోరడం ఆ హక్కును ఉల్లంఘించడమే అవుతుంది. అయితే, ఆ విషయాన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల విశ్లేషణ చేసే సంస్థలు పూర్తిగా విస్మరిస్తున్నాయి. సంకోచం లేకుండా ఏ పార్టీకి ఓటు వేస్తారు? ఇతర పార్టీలకు ఎందుకు ఓటు వేయరు? అని అడుగుతున్నారు. సర్వేలతో విసుగెత్తున్న ప్రజలు అసలు ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందని.. ఎవరు ఇచ్చారని నిలదీస్తున్నారు. మరోవైపు పండుగలను పురస్కరించుకొని కొంతమంది అభ్యర్థులే శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదించాలని కోరుతూ రికార్డెడ్వాయిస్ కాల్స్ చేస్తున్నారు.
టెలీకాలర్: పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి శివప్రసాద్ అనే పేరుమీద గొర్ల లోన్ వచ్చిందా?
శివ ప్రసాద్ : హా.. గొర్ల లోన్ వచ్చింది.
టెలీకాలర్ : ఈ సారి ఎన్నికల్లో దాసరి మనోహర్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని కోరుతున్నా.
శివప్రసాద్ : వారి ఇంట్లకెళ్లి ఇచ్చారా? మీ ఇంట్లకెళ్లి ఇచ్చారా? మేడం.
టెలీకాలర్ : చెప్పమన్నారు.. చెప్పాను సార్.
శివప్రసాద్ : చెప్పుడు కాదమ్మా ఇక్కడా.. వ్యవస్థ మొత్తం అంగడి అంగడి అవుతున్నది. నేను ఎంఏ చేసినా.. గ్రూప్ -1 ఎగ్జామ్ రాసినా క్యాన్సల్. రెండోసారి రాసినా క్యాన్సల్.. మా పరిస్థితి ఘోరంగా ఉందమ్మా... ఏం చెప్పమంటావు.
టెలీకాలర్ : అందరి సిచ్యుయేషన్ ఒక్కటే సార్.
శివప్రసాద్ : మరి మీరెట్లా ఫోన్ చేసి ఓటేయాలని చెప్తారు. మీరంటున్నరు గొర్రెల యూనిట్ అని.. వాళ్ల ఇంట్లోకెళ్లిఇచ్చిండా అమ్మా..
టెలీకాలర్ : ఆహా.. ఇవ్వలేదు సార్.
శివప్రసాద్ : ప్రజల సొమ్మేకదా ఇది. ప్రజలు కట్టే పన్నులతోనే కదా ఈ పథకాలు ఇస్తున్నారు.
టెలీకాలర్ : అవును సార్..
శివప్రసాద్ : దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లోకెళ్లి.. కేసీఆర్ ఇంట్లోకెళ్లి ఇచ్చేది కాదు గదా?
టెలీకాలర్ : ఆహా.. లేదు సార్.
శివప్రసాద్ : ఇంకోసారి ఎవరికీ ఫోన్ చేయకండమ్మా.. జర
టెలీకాలర్ : ఓకే సార్
శివప్రసాద్ : మీకు వచ్చిందా గవర్నమెంట్ జాబ్.. ఇంటికో ఉద్యోగం వచ్చిందా?
టెలీకాలర్ : రాలేదు సార్..
శివప్రసాద్ : దళితబంధు, గృహలక్ష్మి వచ్చిందా అందరికి?
టెలీకాలర్ : రాలేదు సార్...
శివప్రసాద్ : మరీ ఎట్లమ్మా.. ఏదీ రాంది. మీరు ఫోన్ చేసి కేసీఆర్‌కు ఓటు వేయండి.. దాసరి మనోహర్‌రెడ్డికి ఓటు వేయండి. అంటే ఎట్లా వేస్తరమ్మా? ఇంకోసారి చెప్పకండమ్మా దయచేసి.
టెలీకాలర్ : ఓకే సార్.
(నాలుగు రోజుల క్రితం యూట్యూబ్‌లో బీఆర్ఎస్ టెలీకాలర్పేరిట అప్‌లోడ్ అయిన ఓ ఫోన్రికార్డింగ్)