కట్టలు తెంచుకున్న కోమటిరెడ్డి కోపం.. సోనియా సమక్షంలో కేసీఆర్‌పై ఫైర్

by GSrikanth |
కట్టలు తెంచుకున్న కోమటిరెడ్డి కోపం.. సోనియా సమక్షంలో కేసీఆర్‌పై ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీలను ప్రకటించిన సోనియా గాంధీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విజయభేరి సభలో పాల్గొని కోమటిరెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని సీఎం కేసీఆర్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. నియంతగా పాలిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అనివార్య పరిస్థితలు ఏర్పడ్డాయని.. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండని రాష్ట్ర ప్రజలను కోమటిరెడ్డి కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామని చెప్పారు. 100 సీట్లకు తగ్గకుండా గెలవాలని అన్నారు. కనీసం టీఎస్‌పీఎస్సీ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే కేసీఆర్ పని అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలను, కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి విమర్శిస్తే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను హెచ్చరించారు. కాంగ్రెస్ బానిసత్వ పార్టీ కాదని.. బీజేపీ దగ్గర మోకరిల్లిన మీది బానిసత్వ పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story