- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభం.. పాల్గొన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకున్నది. ఈరోజు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మీటింగుకు ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి హాజరయ్యారు. మొదటి రెండు మీటింగ్లలో ఫైనల్ చేసిన 50% అభ్యర్థులను అప్రూవల్ చేస్తూ, మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఈ మీటింగ్‌లో ఫైనల్ చేయనున్నారు. సర్వేలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ ప్రతిపాదించిన పేర్లను బేరీజు చేస్తూ సెలక్షన్ జరగనున్నది. ఈరోజూ తేలని సెగ్మెంట్లకు ఒకటి రెండు పేర్లతోనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కమిటీకి లిస్టు పంపించనున్నారు. ఆ కమిటీ ఫైనల్ చేసిన పేరుకే కాంగ్రెస్ పార్టీ సదరు సెగ్మెంట్ నుంచి టికెట్ ఇవ్వనున్నది.
అయితే, ఫస్ట్ లిస్టును దాదాపు 60 అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రోజుల్లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా టికెట్ల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ క్యూ కట్టారు. వారం రోజుల నుంచి ఢిల్లీలోని ఏఐసీసీ కీలక నాయకులతో, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, సభ్యులతో భేటీ అయ్యారు. బీసీ నాయకులు మైనార్టీ, కమ్మ సామాజిక వర్గ నేతలు, మహిళా కాంగ్రెస్ నేతలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు తమకు ప్రత్యేకంగా టికెట్లు కేటాయించాలని రిక్వెస్ట్ పెడుతున్నారు.