- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల అత్యుత్సాహం.. కాంగ్రెస్ నేత ఇంటి వద్ద హైటెన్షన్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, మద్యం, నగలు పట్టుబడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కొందరు పోలీసులు తనిఖీల పేరుతో అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇవాళ కామారెడ్డి చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నేత గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా కలకలం రేపుతోంది. పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులతో మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో డీఎస్పీ ప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు సమాచారం. పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్‌కు పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు మండిపడ్డారు. ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చారా? లేక బీఆర్ఎస్ నేతలు చెప్తే వచ్చారా? అని ప్రశ్నించారు.