అసెంబ్లీ, ప్రగతి భవన్‌కు కొత్త రంగులు.. ఫొటోస్ వైరల్

by GSrikanth |
అసెంబ్లీ, ప్రగతి భవన్‌కు కొత్త రంగులు.. ఫొటోస్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పోల్స్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత ఆందోళనలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్‌ రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యే వరకు భయం, భయంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు గులాబీ బాస్ కేసీఆర్ ఇస్తున్నట్లు ప్రగతి భవన్, అసెంబ్లీకి కొత్త రంగులు వేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గులాబీ శ్రేణులు మూడోసారి కూడా కేసీఆర్ వస్తారనే దానికి కొత్త రంగులే సంకేతం అని కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు రేపు ఎన్నికల ఫలితాల వేలా ఎందుకీ హడావుడి అని మరి కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పగించడానికి కేసీఆర్ వాటిని సిద్ధం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుందో అని ఫలితాల ప్రకటన రాకముందే ప్రగతి భవన్, అసెంబ్లీకి కొత్త రంగులు వేయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed