- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్ రాదని తెలిసి హుటాహుటిన ఆమె వద్దకు రేఖా నాయక్!
దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో అధికార పార్టీ ఫస్ట్ లిస్ట్‌ను పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయనున్నారు. సోమవారం పంచమి కావడంతో మధ్యాహ్నం 12.03 నుంచి 12.30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. గత ఎన్నికల సమయంలో సైతం పంచమి కావడంతో సెప్టెంబర్ 6న జాబితాను కేసీఆర్ ప్రకటించారు. ఈసారి అభ్యర్థుల లిస్టును 105 మందితో ప్రకటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే, ఇదిలా ఉండగా.. తనకు టికెట్ రాదు అని తెలిసి.. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. ఎమ్మెల్సీ కవితను కలిసి తనకు గోడును వెళ్లబోసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ విడుదల కానుండటంతో రేఖా నాయక్ చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, మరోవైపు కాంట్రవర్సీ ఉన్న వైరా, ఇల్లందు, జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, ఉప్పల్, అంబారిపేట, కోదాడ, నాగార్జునసాగర్, మునుగోడు, భద్రాచలం, మహబూబాబాద్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాలను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.