- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: ఇక రెవెన్యూ డివిజన్‌గా చండూర్.. తుది ఉత్తర్వులు జారీ
దిశ, చండూరు: చండూర్ మండలం ఇక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం బుధవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో ఆర్డీవో కార్యాలయం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలు మండలాలు ఆర్డీవో కార్యాలయాలు నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పరిపాలన ప్రజలకు చేరువైంది. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు చండూరు కేంద్రంగా మునుగోడు, గట్టుప్పల, మర్రిగూడ నాంపల్లి మండలాలను కలుపుతూ ఆర్డీవో కార్యాలయాన్ని ప్రకటిస్తూ సెప్టెంబర్ 5వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ 20న ముగియడంతో తుది నోటిఫికేషన్ బుధవారం విడుదల అయింది. గతంలో మర్రిగూడ నాంపల్లి మండలాలు దేవరకొండ ఆర్డీఓ పరిధిలో ఉండడంతో అక్కడినుండి దస్తావేజులు తెప్పించుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరో వారం పది రోజుల్లో చండూరులో ఆర్డిఓ కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఆర్డీవోను నియమించనుంది. చండూరు పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు కోసం సిద్ధం చేస్తున్న స్త్రీ శక్తి భవన్ పునరుద్ధరణ పనులు పూర్తిగా వచ్చాయి. భవన నిరుపయోగం ఉండడంతో పూర్తిస్థాయిలో వినియోగానికి తీసుకొచ్చేందుకు 10 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేపట్టి త్వరగా అందుబాటులోకి తేచ్చేటందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వారం రోజుల్లో భవనం నిర్మాణం పూర్తిగా అందుబాటులోకి రానుంది.