- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నిందను కాంగ్రెస్‌పై వేసేలా గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్!
దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ బ్లేమ్ గేమ్ పాలిటిక్స్‌కు తెర లేపిందనే విమర్శలు వస్తున్నాయి. రైతుబంధును ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందనే నిందను ఓ ప్లాన్ ప్రకారం చేస్తోందని టాక్ ఉంది. నిజానికి రైతుబంధు కోసం కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని చర్చ అధికార వర్గాల్లో ఉంది. పైసలు లేకపోవడంతోనే రుణమాఫీ, దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ సాయం నిలిచిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతుబంధు ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
నో చెబితే ఈసీపై.. అడ్డుకుంటే కాంగ్రెస్‌పై నేపం
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుబంధు స్కీమ్ కింద రైతలకు ఆర్థిక సాయం చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో సరిగ్గా పోలింగ్‌కు రెండు మూడు రోజల ముందు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఆ ఎన్నికల్లో 88 సీట్లు రావడానికి రైతుబంధు వర్క్ అవుట్ అయిందని గులాబీ లీడర్లు తమ ఇంటర్నల్ మీటింగ్‌లో చాలా సార్లు చెప్పుకున్నారు. ఈసారి అదే తీరుగా రైతుబంధు వర్క్ అవుట్ అవుతుందని కారణంతో ఈసీ అనుమతి కోసం లేఖ రాశారు. ఒకవేళ అనుమతి ఇస్తే తమకు సానుకూలంగా ఓటింగ్ జరుగుతుందని ఆశ పడింది. అయితే ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఈసీపై, ఇవ్వొద్దని లేఖలు రాస్తే విపక్షాలపై నెపాన్ని మోపాలనే ప్లాన్ వేసినట్టు తెలిసింది.
గత యాసింగి పైసలు జనవరిలో
గత ఏడాది యాసింగి రైతుబంధు పైసలను ఈ ఏడాది జనవరి చివరలో మొదలు పెట్టారు. కానీ చాలా చోట్ల వాన కాలం పంట కోతలు కొనసాగుతున్నాయి. అప్పుడే యాసంగి రైతుబంధు పైసల కోసం చర్చను ప్రభుత్వం తెరమీదికి తెచ్చింది. నవంబరు 30న జరిగే పోలింగ్‌కు ముందుగా రైతుబంధు అమలు చేస్తే పాజిటివ్ ఓటింగ్ ఉంటుందని ఆశతో ఈసీ పర్మిషన్ పేరుతో వ్యూహాత్మకంగా నడుచుకుందని అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద జీతాలకు తప్పా మిగతా పథకాల అమలుకు నిధులు లేవని అధికార వర్గాల్లో టాక్ ఉంది. ఒకవేళ కావాల్సినంత నిధులు ఉంటే రుణమాఫీ, దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ సాయం స్కీమ్‌లు మధ్యలో ఆగిపోయేవి కావాని గుర్తుచేస్తున్నారు.
రైతుల్లో సానుభూతి కోసం
కొంత కాలంగా రైతుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ధాన్యం కొనుగోళ్ల సమయంలో మిల్లర్లు తాలు, తడి పేరుతో ఒక్కో బస్తాకు నాలుగైదు కిలోల వరకు కోత పెట్టారు. దీనిపై రైతులు నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓ వైపు రైతుబంధు ఇస్తూ, మరోవైపు కొనుగోళ్ల టైమ్‌లో కోతలు పెడుతున్నారని కోపంగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుబంధు ఇస్తామని, అనుమతి ఇవ్వాలని ఈసీకి లేఖ రాసింది. ఒకవేళ పర్మిషన్ ఇస్తే, ఓటింగ్‌కు రెండు మూడు రోజల ముందు రెండు మూడు ఎకరాల చిన్న రైతుల అకౌంట్లలో డబ్బులు వేయాలని, దీంతో మిగతా రైతుల్లోనూ ఆశ ఏర్పడి పాజిటివ్ ఓటింగ్ అవుతుందని అంచనాలో ఉన్నట్టు తెలిసింది.