- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాంగ్రెస్ పతనాన్ని చూస్తే జాలేస్తుంది: దాసోజు శ్రవణ్
by GSrikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ‘రేవంత్ పే’ పట్ల జాగ్రత్తగా ఉండాలని లేకుంటే తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రజలకు సూచించారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పతనాన్ని చూస్తే జాలేస్తుందన్నారు. ఒకప్పుడు సిద్ధాంతాలకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డ కాంగ్రెస్ పార్టీ, నేడు రాజకీయాలను వ్యాపారంగా, డబ్బు సంపాదనకు సులువైన మార్గంగా భావించే రేవంత్ రెడ్డి చేతిలో బంధీ కావడం సిగ్గుచేటన్నారు.
రేవంత్ రెడ్డి పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరం అన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుని తమ సొంత పార్టీ అభ్యర్ధులనే దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకలు, పొరపాటున అధికారంలోకి వస్తే, తెలంగాణకు ఎదురయ్యే దుష్పరిణామాలను తలుచుకుంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story