ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. సంచలన నిర్ణయం

by GSrikanth |
ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క(శిరీష) ఓటమి చెందిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 5754 ఓట్లు సాధించి సత్తా చాటింది. అయితే, తాజాగా.. తన ఓటమిపై బర్రెలక్క స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా బర్రెలక్కే మీడియాతో వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క రూపాయి ఆశించకుండా, మద్యానికి లొంగకుండా తనను నమ్మి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి, స్వతంత్రంగా దాదాపు ఆరు వేల ఓట్లు సాధించిన తాను నైతికంగా గెలిచినట్లే అని వెల్లడించారు.



Next Story

Most Viewed