YS Viveka Case : నేడు మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-20 14:44:24.0  )
YS Viveka Case : నేడు మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు మరో సారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. నిన్న 8 గంటల పాటు ఆయనను సీబీఐ ప్రశ్నించింది. నిన్న న్యాయవాదితో కలిసి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది.

ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన హైకోర్టు అప్పటి వరకూ ఆయన సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీబీఐ విభాగానికి చెందిన ఎస్పీ వికాస్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తోంది. అయితే తండ్రీ కుమారులైన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను తొలి రోజు విచారణలో వేర్వేగా ప్రశ్నించినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి : Breaking: అవినాశ్‌రెడ్డికి కొనసాగుతున్న సీబీఐ విచారణ



Next Story

Most Viewed