- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసెంబ్లీకి రాని నువ్వు.. ఉనికి కోసమే ఇదంతా! అద్దంకి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: పొలం బాట పట్టాలని మాజీ సీఎం కేసీఆర్‌కు విపక్షంలోకి వచ్చిన తర్వాత అర్ధమైందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల కోసమే పొలం బాట పట్టిండని తాజాగా మీడియాతో మాట్లాడారు. జనం బాట మరచిన కేసీఆర్ ఇంకా ప్రజల ఎజెండా ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత.. నేడు జనంలో కనపడటం చాలా విచిత్రంగా ఉందన్నారు.
పదేళ్ల క్రితం మర్చిపోయిన జనాన్ని రాజకీయాల కోసం ఇప్పుడు అవసరమోచ్చారని విమర్శించారు. అప్పుడే ఇలా చేసుంటే కేసీఆర్‌కు ఈ గోస వచ్చేది కాదన్నారు. గతంలో రైతులు పంట నష్టపోతే ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ రైతల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఎన్నికలు, రాజకీయాలు తప్ప కేసీఆర్‌కు ఏమి తెలియదన్నారు. అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ తన ఉనికి కోసమే పొలం రైతు బాట అని విమర్శించారు.