- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యథా సీఎం తథా ఎమ్మెల్యే! కూల్చివేతలపై టీ కాంగ్రెస్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. వాస్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు దశబ్దాల చరిత్ర కలిగిన సచివాలయాన్ని ధ్వంసం చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కమీషన్ల కోసం కేవలం ఆరేండ్ల కిందట కట్టిన ఇరిగేషన్ బిల్డింగునే కూల్చాడని ధ్వజమెత్తింది. ఎవడబ్బ సొమ్మని ఈ కూల్చివేతలు అని కాంగ్రెస్ పార్టీ గురువారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.
చెన్నూరులో నిర్మించిన ఆరేళ్లకే ఇరిగేషన్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందంటూ కూల్చివేయాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశించడంపై వచ్చిన వార్తా కథనాలను టీ కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పించింది. గతంలో సీఎం కేసీఆర్ ఆరు దశబ్దాల చరిత్రకు సమాధి కడితే ఇప్పుడేమో ఆయన బానిస కమీషన్ల కోసం ఇరిగేషన్ బిల్డింగ్ నే కూల్చాడంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది.