- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించిన సంక్షేమం ఆగదు : మంత్రి శ్రీధర్ బాబు
దిశ, మహేశ్వరం: ప్రతిపక్షాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన విమర్శించిన, సృష్టించిన సంక్షేమం ఆగదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ, కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను నెరవేరుస్తున్నమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 2011 లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించామన్నారు.
రైతాంగానికి ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ హామీని నెరవేర్చి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు. తరుగు పేరుతో రైతులు మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లో కొత్త నగరం నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ బరిగేలా హేమలత రాజుగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేఎల్ఆర్, దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, బొక్క జంగారెడ్డి, పలు శాఖల అధికారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.