- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Uttam Kumar Reddy : కులగణన లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : కుల గణన (Caste Census)సర్వే నివేదిక లెక్కల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పథకాల రూపకల్పన చేస్తుందని కులగణన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో బీసీ కులగణనపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Power Point Presentation)ఇచ్చారు. కుల గణన సర్వే మీద కొందరు అపోహలు..అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కుల గణన సర్వే ఎలా జరిగింది అనేది ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వివరిస్తుందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్ గా దేశంలోని ఏ రాష్ట్రంలో కుల గణన జరగలేదని ఉత్తమ్ తెలిపారు.
కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవద్దని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ వివరణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే జరిగిందని, సర్వేపై ప్రజలు ఎవరికి ఇందులో అపోహలు అవసరం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. మొదట సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చుకున్నారని..అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్ అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసుకొని చేసిందేనన్నారు.
కులగణన సర్వేకు సంబంధించి వ్యక్తిగత వివరాలు మినహాయించి రేపు, ఎల్లుండిలోగా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను జిల్లాల వారిగా పెడతామని ఉత్తమ్ వెల్లడించారు. సర్వేపై అపోహలు, అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి వారితో చర్చించి అపోహాలను నివృత్తి చేస్తామన్నారు. కుల గణన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సహా ఇతర మంత్రులు హాజరయ్యారు.
రేపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
కులగణన, ఎస్సీ వర్గకరణ అంశాలతో పాటు ప్రభుత్వం పథకాల అమలు..ఇతర సమస్యలపై చర్చిందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సమావేశం కొనసాగనుంది. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కలు ఎమ్మెల్యేలతో ముఖాముఖీలో పాల్గొంటారు.
సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు.