పాలు ఉన్న చోటే సంపద.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Sathputhe Rajesh |
పాలు ఉన్న చోటే సంపద.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్ : పాలు ఉన్న చోటే సంపద ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 50వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో పాడి ఉత్పత్తి ఒక భాగం అన్నారు. పాలు పొంగించి శుభాలు పొందాలన్నానరు. పాలు ఉన్న చోట సంపద ఉంటుందని తెలిపారు. పాడి ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు ఒక సంపద లాంటిదని.. తెలంగాణలో పాడి ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డెయిరీ పరిశ్రమ అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. స్వయం సహాయక సంఘంలో ఉన్న

మహిళలకు పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడానికి ఆర్థికంగా ప్రోత్సాహిస్తున్నామన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి నేతృత్వంలో దేశంలో హరిత, శ్వేత విప్లవానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి బాటలు వేశారన్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ఈ వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేశామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ - ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన డెయిరీ ఇండస్ట్రీ క్లస్టర్స్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed