- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు ప్రభుత్వం తరుపున వైద్యం చేయిస్తాం: మెట్టు సాయికుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ దిమాక్ చిన్నగా ఉన్నదని, డ్రగ్స్ తీసుకోవడం వలన ఖరాబ్ అయిందని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కుమార్ విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషికి అవార్డు వస్తే, కేసీఆర్ వల్లే అవార్డు వచ్చిందని అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. కేటీఆర్ మెదడుకు చిల్లు పడితే తమ ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామన్నారు. కేటీఆర్ మాటలకి మత్స్యకారులు నవ్వుతున్నారన్నారు. అబద్దాల యూనివర్సిటీలో పట్టా పొందిన వ్యక్తి కేటీఆర్ అని మండిపడ్డారు. దాచేసిన సత్యం అంటూ అసలు సత్యాన్ని కేటీఆర్ దాచారన్నారు.
కేటీఆర్ తన జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా? అని ప్రశ్నించారు. అబద్దాల విషయంలో కేటీఆర్ హరీష్ రావు తో పోటీ పడుతున్నారన్నారు. కేసీఆర్ అబద్దాల రికార్డు బ్రేక్ చేసేందుకు ఈ ఇద్దరు నేతలు కష్టపడుతున్నారని చురకలు అంటించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో 32 మొబైల్ ఫిష్ క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు తీసుకున్న నిర్ణయాల వలనే తమకు అవార్డు వచ్చిందన్నారు. భీమా పధకం ద్వారా 4 లక్షల 16 మంది సభ్యుల జీవితాలు కాపాడేందుకు రూ.139 కోట్లు ప్రీమియం చెల్లించినందుకు ఈ అవార్డు వచ్చిందన్నారు.