- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి సంపదను కాపాడుకుంటాం.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంపద తరలిపోకుండా కాపాడుకుంటామని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో సింగరేణి గుర్తింపు ఎన్నికలలో ఎఐటీయూసీకి పట్టం కట్టిన సింగరేణి కార్మికులకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కూనంనేని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ... కష్టకాలంలో సింగరేణిని బ్రతికుంచుకోవాలనే పట్టుదలతో పోరాటాల సంఘమైన ఎఐటీయూసీకి వేలాది మంది ఓట్లు వేసి సుమారు మూడు వేల మెజారిటీతో గెలిపించారని తెలిపారు.
సింగరేణి పరిధిలో కొత్తమైన్స్‌ను తీసుకరావడానికి కృషి చేస్తామని అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వం నుండి కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు. మైన్స్ ప్రైవేట్ పరం కాకుండా సింగరేణి పరిధిలోనే ఉండే విధంగా పోరాటం చేస్తామని తెలియజేశారు. ప్రతి కార్మికుడికి సొంత ఇళ్లు సౌకర్యం కోసం కృషి చేస్తామని ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. సింగరేణి సంపదను దారిమళ్లించి, దుర్వినియోగం చేసిన సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇతర అధికారులపైన న్యాయవిచారణ చేయాలని డిమాండ్ చేశారు.