ప్రస్తుత ప్రభుత్వ పథకాలను ఆపబోం.. అన్ని అలాగే కొనసాగిస్తాం.. పవన్ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-02-07 16:11:57.0  )
ప్రస్తుత ప్రభుత్వ పథకాలను ఆపబోం.. అన్ని అలాగే కొనసాగిస్తాం.. పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న ఎన్నికల్లో ఏర్పడబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ప్రస్తుతం అమలు అవుతున్న ప్రతి పథకాన్ని కొనసాగిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు కొనసాగుతున్న పథకాలకు అదనంగా డబ్బు జోడించి ఇస్తామని, ఏ పథకాన్ని రద్దు చేయబోమని పేర్కొన్నారు. కావాలంటే తన వ్యక్తిగత సంపాదనను కూడా ప్రజలకు పంచేందుకు సిద్ధమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు న్యాయం జరగలేదని ఆరోపించారు.

Advertisement

Next Story